ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్
హనుమకొండ సెప్టెంబర్ 29 అక్షయ న్యూస్:
హనుమకొండ నగరంలోని ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులకు టాయ్ లెట్స్ రూమ్స్ మరియు మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు మంగళవారం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ టాయిలెట్ రూమ్స్ మరుగుదొడ్లు వాడకంలో లేకపోవడం వలన అలాగే లోపల పలిగి పోవడం వలన చెత్త చదరం పేరకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు అలాగే కాలేజీ ప్రిన్సిపల్ కి చెప్పిన పట్టించుకోలేదన్నారు కళాశాల ముందు మొత్తం గడ్డి ఉందన్నారు నిరంతరం విష పురుగులు తిరుగుతున్నాయని విద్యార్థులు చెప్పారన్నారు కొన్ని తరగతి గదులలో ఫ్యాన్స్ లైట్స్ సరిగా పనిచేయడం లేదన్నారు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు అలాగే పై అధికారులు స్పందించి వెంటనే నూతన టాయిలెట్స్ రూమ్స్ ను అలాగే మరుగుదొడ్ల ను ఏర్పాటు చేయాలన్నారు విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు లేదంటే ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బీరెడ్డి జశ్వంత్, జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరీ సాయి కుమార్ ,భాను ప్రసాద్, రాజ్ కుమార్ సందీప్ ,ప్రశాంత్ ,వినోద్ సాయి ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు