🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా.. చల్లా..

Main Image

పరకాల సెప్టెంబర్ 28 అక్షయ న్యూస్:

పరకాల పట్టణంలో ఇటీవల మృతిచెందిన కోగిల అక్షిత్, పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో మృతిచెందిన పల్లెబోయిన రాధమ్మ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ఎలాంటి ఆపద వచ్చినా తన వంతు సహకారం అందిస్తానని చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home