🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పకడ్బందీ ప్రణాళికతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి

Main Image Additional Image Additional Image


తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క


హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎల్ నినో సన్నద్ధత, విబిజి రాంజీ, ఆర్డబ్ల్యూఎస్, హ్యామ్ రోడ్స్ పై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం


హనుమకొండ సెప్టెంబర్ 25 అక్షయ న్యూస్:

తాగునీటి సరఫరాకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, పకడ్బందీ
ప్రణాళికతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎల్ నినో సన్నద్ధత, విబిజి రాంజీ, ఆర్డబ్ల్యూఎస్, హ్యామ్ రోడ్స్ పై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న సీతక్కకు పోలీసులు గౌరవ వందనం సమర్పించగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఎల్ నినో, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. సాగునీరు, తాగునీరుకు సంబంధించిన అంశాలను సాగునీటి పారుదల శాఖ అధికారులు, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులు ఆయా శాఖల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతి గురించి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ తాగునీరు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చేపట్టే బోర్ రీచార్జ్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని, నీటి నిల్వలు, రిజర్వాయర్లు, బోర్లు, మోటార్లు తదితర వాటి పరిస్థితిని నిరంతరం పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రతీ ఇంటింటికీ ఇంకుడు గుంత, ప్రతీ పంటకు పంట కుంటలను,ప్రతీ ఊరు కి ఊట కుంట లను నిర్మించాలన్నారు గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, నీటి రీచార్జ్‌ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వీటి ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ మాట్లాడుతూ.. వీబీజీ రాంజీ పథకం ద్వారా కూలీలకు పని దినాలు కల్పించాలని అన్నారు. పథకం ద్వారా చేపట్టిన పనుల పురోగతి పై ప్రతి పదిహేను రోజులకోసారి అధికారులు సమీక్ష చేయాలన్నారు. పనులను పూర్తి చేయడంలో, కూలీలకు ఉపాధి కల్పించే విషయంలో స్థానిక సర్పంచులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సమావేశంలో సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి అనే అంశాలపై అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు.


🏠 Home