🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

శనివారం నుండి పరకాల వంద పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం

Main Image
శనివారం నుండి పరకాల వంద పడకల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభం

వంద పడకల ఆసుపత్రిని పరిశీలించిన ఆర్డిఓ వెంకన్న.


పరకాల సెప్టెంబర్ 25 అక్షయ న్యూస్:
పరకాల పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం రెవెన్యూ డివిజన్ అధికారి డి ఎస్ వెంకన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో శనివారం నుండి ఓపీ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.ఓపీ సేవలు సజావుగా నిర్వహించేందుకు ఆసుపత్రి సిబ్బందికి అవసరమైన తగు సూచనలు, సలహాలను రెవెన్యూ డివిజన్ అధికారి డి ఎస్ వెంకన్న తెలియజేశారు .పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, శనివారం నుండి వంద పడకల ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్న ఓపీ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ టి. విజయలక్ష్మి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ వంశీకృష్ణ డాక్టర్ల బృందం పాల్గొన్నారు.
🏠 Home