చైనాలో జరిగే అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీకి హనుమకొండ బాలిక ఎంపిక

హనుమకొండ సెప్టెంబర్ 24 అక్షయ న్యూస్:
:హనుమకొండకు చెందిన యువ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణి వేల్పుల సాయి వర్షిణి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
హనుమకొండలోని గ్రీన్ వుడ్ హై స్కూల్
లో 8వ తరగతి చదువుతున్న సాయి వర్షిణి గత నాలుగు సంవత్సరాలుగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కోచ్ పొలెపాక వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సాఫ్ట్‌బాల్‌లో శిక్షణ పొందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన ఆమె, వరంగల్‌లో , మెదక్‌లో , నిజామాబాద్‌లో రాష్ట్రస్థాయి మీట్స్‌లో పాల్గొంది.అదేవిధంగా ఔరంగాబాద్‌లో అండర్-15 బాలికల జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న సాయి వర్షిణి, అనంతరం 5వ ఆసియా కప్ ఎంపిక ట్రయల్స్‌లో2026 పాల్గొంది. మహారాష్ట్రలోని కోపర్గావ్లో ఉన్న సంజీవని యూనివర్సిటీలో జూలై 24, 25 తేదీల్లో జరిగిన ఎంపిక ట్రయల్స్ ద్వారా అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.సాయి వర్షిణి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న తెలంగాణ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ డా. పిల్లి సాంబశివరావు, హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి టాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తిలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న సాయి వర్షిణి భవిష్యత్తులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.