మమతా నగర్‌లో భక్తిశ్రద్ధలతో ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు.

పరకాల, సెప్టెంబర్ 23 అక్షయ న్యూస్:
పరకాల పట్టణంలోని మమతా నగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు నిత్య అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడంతో కాలనీలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నరేన్ రాక్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలం పాటలో శ్రీ మాటూరి రాజేందర్ దంపతులు రూ.45,116కు లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. స్వామివారి సన్నిధిలో తొమ్మిది రోజుల పాటు పూజలు, అభిషేకాలు అందుకున్న లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకోవడంతో భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.ఈ సందర్భంగా నరేన్ రాక్ స్టార్ యూత్ సభ్యులు మాట్లాడుతూ, మాటూరి రాజేందర్ దంపతులు లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని, వారి కుటుంబ సభ్యులపై గణపతి స్వామి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.తొమ్మిది రోజుల పాటు గణేష్ మండపం వద్ద నిర్వహించిన నిత్య అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరి రోజున కాలనీవాసులు ఆటపాటలతో సందడి చేస్తూ గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాలు, యువత సందడి నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.