చల్లా పరామర్శ..
సంగెం సెప్టెంబర్ 19 (అక్షయ న్యూస్) :
సంగెం మండలం కుంటపల్లి, నార్లావాయి గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన చిర్ర సుశీల, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు బూర ప్రకాష్ తండ్రి నర్సయ్య కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అదేవిధంగా మొండ్రాయి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై విశ్రాంతి తీసుకుంటున్న గుర్రం సుమన్‌ను, రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన బొల్ల వెంకటయ్యను చల్లా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చల్లా ధర్మారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.