🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

పరకాలలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..

Main Image Additional Image

వేడుకలలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల సెప్టెంబర్ 17 (అక్షయ న్యూస్) :
గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమరధామం యందు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
.తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, త్యాగాల ఫలితంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకున్నారు
ప్రజలకు మరింత మెరుగైన పాలన, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత పరకాల అమరరామం మరో జలియన్ వాలాబాగ్ అన్నారు. ఈ వేడుకలలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ ఆర్డీవో వెంకన్న ఏసీపీ సతీష్ బాబు మున్సిపల్ కమిషనర్ పవన్ తహసిల్దార్ విజయలక్ష్మి సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్సై రఘు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
🏠 Home