🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

అలక చెందిన నడికుడ మండల సర్పంచులు

Main Image Additional Image

సర్వసభ్య సమావేశం వాయిదా వేసిన ఎంపీడీవో

లికిత పూర్వకంగా ముందస్తు సమాచారం తెలపనందుకే హాజరు కాలేకపోయాం సర్పంచులు..

నడి కూడ సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) : నడికుడ మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ అధ్యక్షతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం మండల సమన్వయ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి 15 గ్రామాల ప్రథమ పౌరులు అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా 15 గ్రామాల సర్పంచులు గై హాజరు కావడం జరిగింది సర్పంచులు హాజరు కానందున ఫోరం లేనందున మండల సమన్వయ సమీక్ష సమావేశం వాయిదా వేయడం జరిగిందని ఎంపీడీవో రామకృష్ణ పత్రికా ముఖంగా తెలిపారు. అనంతరం సర్పంచ్ల ఫోరం పత్రికా ముఖంగా మాట్లాడుతూ మండల పరిషత్ అధికారులు అధికారికంగా లిఖితపూర్వకంగా గ్రామ ప్రథమ పౌరులకు సమాచారం తెలుపకపోయేసరికి హాజరు కాలేకపోయామని తెలియజేశారు అదేవిధంగా సర్వసభ్య సమావేశంలో గ్రామాల సమస్యలు అధికారులకు తెలియజేస్తాం అనుకుంటే అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడం వలన తెలుపలేకపోతున్నామని ఈసారి సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు వచ్చేలా మండల అధికారులు చొరవ తీసుకోవాలని తెలియజేశారు.

ఎంపీడీవో ఆర్ రామకృష్ణ ను వివరణ కోరగా

మండల పరిషత్ లో ఉద్యోగుల కొరత ఉన్నందున మండల సమన్వయ సమావేశానికి గ్రామ ప్రథమ పౌరులకు లిఖితపూర్వకంగా అందజేయలేక పోయామని త్వరలో నిర్వహించబోయే సమన్వయ సమావేశానికి లిఖిత పూర్వకంగా అందజేస్తామని అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా చొరవ తీసుకుంటామని తెలియజేశారు


🏠 Home