🏠 Home
Watermark

AKSHAYA NEWS

Reporter
Reporter
Scan to Read Scan to Read

ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Main Image
ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

సిఎంఆర్ఆఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల సెప్టెంబర్ 15 (అక్షయ న్యూస్) :
మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల టౌన్,పరకాల, నడి కూడ, ఆత్మకూరు దామెర మండలాల పరిధిలోని 272 మంది లబ్ధిదారులకు 1కోటి 5లక్షల 8250 రూ విలువ గల సిఎంఆర్ఆఫ్ చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిలుస్తుంది అన్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం పాలకుల వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అన్నారు. గత బి ఆర్ ఎస్ నాయకులు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి పథకంలో అక్రమాలు చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ పట్టణ మండలాల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు సీఎం సహాయనిధి లబ్ధిదారులు పాల్గొన్నారు

🏠 Home