పరకాల లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలి
ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ భూమి – ఆక్రమణ నిషేధం” అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యాలి
15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి
పరకాల, సెప్టెంబర్ 11 (అక్షయ న్యూస్) :
పరకాల పట్టణంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పరకాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కుక్కల విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలోని హనుమకొండ రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 7½ గుంటల ప్రభుత్వ స్థలం, సర్వే నంబర్ 950లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించే అవకాశం ఉన్నందున, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వ భూమి హద్దులను గుర్తించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజలందరికీ చెందుతాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.అలాగే సర్వే నంబర్ 950కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వ భూమి హద్దులను నిర్ధారించాలని, అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, “ప్రభుత్వ భూమి – ఆక్రమణ నిషేధం” అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు బీజేపీ తరఫున ప్రజలతో కలిసి ప్రజా పోరాటం చేపడతామని కుక్కల విజయ్ కుమార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షులు గాజుల నిరంజన్,
9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి,
12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్, మాజీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల
రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.