పరకాల నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నేతలు
పరకాల నూతన సీఐ కి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నేతలు
పరకాల సెప్టెంబర్ 10 (అక్షయ న్యూస్) : పరకాల పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ ను బుధవారం పరకాల పట్టణ బిజెపి నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారుఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డా. సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.పరకాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో నూతన సీఐ గా కీలక పాత్ర పోషించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ పరకాల పట్టణ కౌన్సిలర్లు కుక్కల విజయ్ కుమార్, ఆకుల లావణ్య శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న,పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి
పాలకుర్తి తిరుపతి, కిసాన్ మోర్చా రాష్ట్ర లీగల్ సెల్ నాయకురాలు వేముల సదా రాణి ఆంజనేయులు, ఓబిసి మోర్చా జిల్లా అధికార ప్రతినిధిఉడుత చిరంజీవి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి కృష్ణ ప్రసాద్, బాసాని సోమరాజు,సోషల్ మీడియా కన్వీనర్ మెంతుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.