నాగారం గ్రామంలో పోషణ మాస అవగాహన ర్యాలీ
నాగారం గ్రామంలో పోషణ మాస అవగాహన ర్యాలీ
పరకాల సెప్టెంబర్ 10 (అక్షయ న్యూస్) :
పరకాల మండలం నాగారం గ్రామంలో 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా ఐసీడీఎస్ నాగారం సెక్టార్, పరకాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో భారతి గ్రామైక్య సంఘం మహిళలకు పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగారం గ్రామ సర్పంచ్ ఎరుకొండ రమాదేవి శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ జె.రాణి, ఐకేపీ సీసీ కేదారీ హాజరయ్యారు. గ్రామంలో పోషకాహార అవగాహన ర్యాలీ నిర్వహించి, పోషణ ప్రతిజ్ఞ చేశారు. స్థానికంగా లభించే ఆకు కూరలు, కూరగాయలతో పోషక విలువలు నష్టపోకుండా వంట చేసే విధానాలను ఫుడ్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించారు. చిరుధాన్యాలతో జావా తయారీ, వాటి ఉపయోగాలు, వివిధ వంటకాల తయారీని వివరించారు. మహిళల్లో రక్తహీనత నివారణకు ఆకు కూరలు, తాజా కూరగాయలు, నువ్వులు, పల్లిపట్టి, ఖర్జూర, కొబ్బరి వంటి ఆహార పదార్థాలను రోజువారీ వంటల్లో వినియోగించాలని రాణి సూచించారు.పెరటి తోటలు, చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సి ఎ శంకర్, సంఘం అధ్యక్షురాలు దివ్య, అంగన్వాడీ టీచర్లు రజిత, కవిత, లక్ష్మీ, రమ, శ్రీలత, కమిటీ సభ్యులు, గ్రామైక్య సంఘం మహిళలు పాల్గొన్నారు.