బడి పంతుల్ల గలాట - బయటపడ్డ బాగోతం..!
ముఖ్యమైనవి:పాఠశాలలో పీఎం శ్రీ నిధుల ఖర్చుపై వివాదం..ప్రభుత్వ పంతుల్ల పరస్పరం ఆరోపణలు..పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయులు
అక్షయ వెబ్ న్యూస్ సెప్టెంబర్ 8 నడి కూడ
సమ సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా భావించే ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా నడికూడ మండలం వరికోలు ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం నిధుల ఖర్చుపై మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులు పరస్పరం వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తల్లిదండ్రుల సమక్షంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది.పీఎం శ్రీ నిధుల ఖర్చుపై
చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్, పాలకవర్గానికి సమాచారం ఇవ్వకుండా, తమకు అనుకూలంగా ఉన్న కొందరు తల్లిదండ్రులను మాత్రమే పిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమావేశంలో నిధుల వినియోగం, పంపకాల అంశంపై ఉపాధ్యాయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.
గతంలోనూ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు
పాఠశాల నిధుల వ్యవహారంపై గతంలోనూ వివాదాలు తలెత్తినట్లు సమాచారం. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఫోర్జరీ సంతకాలతో నిధులు దుర్వినియోగం చేశారంటూ కొందరు ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పీఎంసీ నిధుల వినియోగంలోనూ అవకతవకలు జరిగాయంటూ మండల, జిల్లా విద్యాధికారులకు గతంలో ఫిర్యాదులు అందినట్లు సమాచారం.మంగళవారం మరోసారి పాఠశాలలో వివాదంచోటు చేసుకోవడంతో
ప్రధానోపాధ్యాయుడు శరత్ ఉపాధ్యాయుడు అశోక్‌పై పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం . పాఠశాల నిధుల వినియోగంపై నెలకొన్న వివాదంపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. బడి పంతుల్ల అవినీతి బాగోతం బట్టబయలు చేయాలని జిల్లా అధికారులు ప్రత్యేక తీసుకొని తూతూ మంత్రంగా విచారణ చేపట్టకుండా వీరికి వచ్చిన నిధులు ఎన్ని చేపట్టిన పనులు ఎన్ని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజల ముందు వెలుపుచ్చాలి అని గ్రామస్తులు జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు